మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం – సర్పంచ్ కాసాని
కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాల ద్విసప్తాహం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాల రాష్ట్ర నిర్వహణ కమిటీ రూపొందించిన రోజువారీ కార్యక్రమాల ప్రకారం ఈరోజు మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో సర్పంచ్ కాసాని సైదులు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రధాన రహదారి వెంట జాతీయ నినాదాలు చేస్తూ ఎస్సీ కాలనీ వరకు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ దేశానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుల జీవితాలు వారి త్యాగాలు మనం ఆదర్శంగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ జర్పుల తులసిరామ్, స్థానిక ఏఎన్ఎం ఉపేంద్రరాణి, గ్రామ తెరాస అధ్యక్షులు జహంగీర్ షరీఫ్, సెక్రటరీ నాగరాజు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పాలేరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షులు పిల్లి రాంబాబు, బుడిగ వెంకన్న, జంపాల ఉప్పయ్య, చెరుకుపల్లి గోవర్ధన్, జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తెరాస కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.