మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులర్పించిన హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి)

జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని మానుకోట పట్టణంలోని స్థానిక గాంధీ పార్క్ లోనీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో కలిసిజిల్లా కేంద్రంలో లాల్ బహదూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకుని, అనంతరం మానుకోట పట్టణంలోని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ ల సేవలను త్యాగాలను దేశ ప్రజలు మర్చిపోరాని వారి బాటలో ప్రతీ ఒక్కరూ దేశ సేవకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఒద్ధీరాజు రామచంద్ర రావు, మానుకోట పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, బిజెపి సీనియర్ నాయకులు మాధవపెద్ది శశివర్ధన్ రెడ్డి, లక్ష్మణ రావు, వల్లపు దాసు భద్రయ్య, రాధా పటేల్, రామారావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ధారా ఇందూ భారతి, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లే సందీప్, రూరల్ ప్రధాన కార్యదర్శి మారగాని రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు జల్లి ప్రశాంత్, పట్టణ నాయకులు శివకుమార్, రవి నాయక్, సట్ల యాకన్న తదితరులు పాల్గొన్నారు.