మహాత్ముడు పుట్టిన గడ్డపై.. మరుగుజ్జుల మతిలేని చేష్టలు


` దేశాన్ని సొంతఆస్తిలా మోదీ అమ్మేస్తున్నాడు
` నూతన విద్యుత్‌ చట్టం రైతులపాలిట శాపం
` కేంద్రం భేషరతుగా ఉపసంహరించుకోవాలి
` కేంద్రం ప్రతిపాదించే విద్యుత్‌ బిల్లును అంగీకరించం
` ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతాం
` విద్యుత్‌ సంస్కరణల పేరుతో దోపిడీ యత్నాలు
` మోడీ ఫాసిస్టు విధానాలతో రైతులకు తీరని నష్టం
` విభజన చట్టంలో తెలంగాణకు అనేక విధాలుగా నష్టం
` సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును ఏకపక్షంగా ఎపికి అప్పగించారు
` అన్యాయంగా ఏడు మండలాలను కూడా అప్పచెప్పారు
` ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు
` మేం అమ్ముతున్నాం..విూరూ అమ్మండనే విధానం
` అసెంబ్లీలో మోడీ సర్కార్‌ తీరును ఏకి పారేసిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఎట్టి పరిస్తితుల్లోనూ కేంద్రం ప్రతిపాదించే విద్యుత్‌ బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో చేస్తున్న దోపిడీ యత్నాలను అడ్డుకుని తీరుతామన్నారు. విద్యుత్‌ చట్టంపై కేంద్రం పెత్తనం ఏమిటని కేసీఆర్‌ ప్రశ్నించారు.దేశ రైతాంగాన్ని సంఘటితం చేసి, కేంద్రంపై పోరాడుతామన్నారు. మోడీని తప్పించి దేశంలో రైతాంగ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని అన్నారు. అలాగే కేంద్రం దోపిడీ విధానాలను సహించే ప్రసక్తే లేదన్నారు. విద్యుత్‌ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు మాట్లాడుతూ.. మోదీ మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రధాని అని ఆనాడే చెప్పానని కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. రాష్టాల్రు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నా యనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు.  మోటర్లకు విూటర్లు పెట్టాలని కేంద్ర విద్యుత్‌ బిల్లులో ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం విూటర్లు పెడితే 98 లక్షల కుటుంబాలపై భారం పడుతుందని చెప్పారు. రాష్టాల్రతో సంప్రదింపులు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా విద్యుత్‌ సవరణ బిల్లును తెచ్చారని ఆరోపించారు. పార్లమెంట్‌ లో ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి నోరు నొక్కడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. రైతుల మోటర్లకు విూటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్ని స్తోందని విమర్శించారు.  విద్యుత్‌ బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే అసత్యాలు చెప్పారన్న సీఎం… ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విూటర్‌ లేకుంటే కనెక్షన్‌ కట్‌ చేయాలని విద్యుత్‌ బిల్లులో ఉందన్నారు. విద్యుత్‌ బిల్లును అమలు చేస్తేనే ఎఫ్‌ఆరీ బీఎం పరిధి పెంచుతామని కేంద్రం చెబుతోందన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్న సీఎం… ఇష్టమొచ్చినట్లు చట్టాలు తెస్తూ రాష్టాల్రు అమలు చేయాలని అంటోందని విమర్శించారు. కానీ రాష్ట్ర సర్కారు విద్యుత్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చిన రాష్ట్రం దేశంలో  తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ వెతలు ఎలా ఉండేవో ప్రతి ఒక్కరికి తెలుసుని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సింగరేణి కాలరీస్‌ లో రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు కల్పించారన్నారు. అలాగే సీలేర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ను రాష్టాన్రికి కేటాయించారని అన్నారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక…  తన ఫస్ట్‌ కేబినెట్‌ విూటింగ్‌ లనే రాష్ట్ర మండలాలను లాక్కున్నారని ఫైర్‌ అయ్యారు. కనీసం సీలేర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నైనా ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదన్నారు. విద్యుత్‌ బిల్లుతో 20 లక్షల ఉద్యోగులు ఆగమైతరని అన్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్న విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పజెప్పేందుకు కేంద్ర కుట్రలు పన్నుతోందన్నారు.  దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 20 లక్షల మంది తమ ఉద్యోగులను కోల్పోతారని చెప్పారు.  విభజన చట్టంలో తమకు రావాల్సిన 40 వేల మెగా వాట్ల విద్యుత్‌ను ఇవ్వాలని కోరారు.  మెడికల్‌ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదనన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రూ.17 వేల కోట్లు రావాలని.. ఆ డబ్బులను కేంద్రం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.  విదేశీ బొగ్గు కొనకపోతే ఎన్టీపీసీ నుంచి కరెంట్‌ ఆపేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నియంత పోకడలను మానుకొని ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణ కు అన్యాయం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే తెలంగాణ గొంతు నులిమిందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ సహా మండలాలను లాక్కున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూకదాడులు చేస్తున్నారని, ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేకుండా వ్యవహరిస్తు న్నారని దుయ్యబట్టారు. విద్యుత్‌ సంస్కరణలు అనే ముసుగులో.. రైతులను దోచుకునే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ మోదీపై ఫైర్‌ అయ్యారు. అంబేద్కర్‌ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు బీజేపీ తీసుకువచ్చిన విద్యుత్‌ సంస్కరణల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రఘునందన్‌రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను సీఎం కేసీఆర్‌ తూర్పారబట్టారు. ఆధునిక ప్రపంచంలో యావత్‌ ప్రపంచం కూడా ఆయా దేశాలు, నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటటువంటి అభివృద్ధి అనేక కొలమానాల ద్వారా చూస్తారు. అందులో ప్రధానసూచిన
పర్‌ క్యాపిటా, పవర్‌ యూటిలైజేషన్‌. ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఎంత పవర్‌ యూజ్‌ చేస్తున్నరు? అది చాలా ముఖ్యమైన సూచికల్లో భాగంగా ఆధునిక ప్రపంచ పరిగణిస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే.. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో కరెంటు, దాని సరఫరా, ప్రజల పడ్డ బాధలు, దాన్ని వినియోగించే సమయంలో జరిన మరణాలకు మన అందరం ప్రత్యక్ష సాక్షులం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ నాడు అనేక ప్రాంతాల్లో కరెంటు షాక్‌లు కొట్టిచనిపోవడం. బిల్లు కట్టలేదని ఎలక్ట్రిసిటీ విజిలెన్స్‌ అధికారులు విషం తాగి చనిపోవడం. భిక్షపతి అనే వ్యక్తి జమ్మికుంటలో చనిపోవడం. అక్కడికి మేము అందరం ఉద్యమ సమయంలో వెళ్లాం. వెరసి కష్టాలను ఇప్పుడు తలచుకుంటేనే భయమవుతుందని అన్నారు. కష్టపడి అందరం కలిసి పోరాటం చేసినం. తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న తర్వాత భయంకరమైన అన్యాయం చేసింది. నేను భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్న. పునర్వీభజన చట్టంలో ఉన్న అనేక అంశాల్లో ఘోరాతి ఘోరంగా మోదీ ప్రభుత్వం అన్యాయం చేసింది. మొదటి కేబినెట్‌లో కేంద్రం తెలంగాణ గొంతు నులిమేసే విధంగా.. అందులో మరీ ముఖ్యంగా 460 మెగావాట్ల హైడ్రో ఎలక్టిక్రల్‌ ప్రాజెక్టు సీలేరును ఆంధ్రాకు కేటాయించింది. సోనియా గాంధీ రాష్ట్ర విభజన సమయంలో బిల్లు తుది దశకు వచ్చే సమయంలో తెలంగాణ పవర్‌ షాటేజ్‌ ఉంటది. పవర్‌ యుటిలేజేషన్‌ ఉంటది. తెలంగాణ మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో మాకు వస్తాయన్న ప్రాజెక్టులు రాలేదు కాబట్టి. ప్రజలంతా గతిలేక బోరు వేసుకునే పరిస్థితిలో ఉన్నరు. తెలంగాణలో ఉన్న బోర్లు దేశంలో ఎక్కడా లేవు. కరెంటు కేటాయింపులో అధికంగా కేటాయించాలని కోరితే.. 53శాతం తెలంగాణకు కేటాయించారు. దాన్ని దృష్ట్యా సీలేరు పవర్‌ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారు. భవిష్యత్‌లో దీని పరిస్థితి ఇట్లే ఉంటదని అని చెప్పి ఇతరులు పేచీపెట్టినప్పటికీ.. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో ఆ రోజు బిల్లులో సింగరేణి కాలరీస్‌ మొదటి నుంచి తెలంగాణదే.. దానిపై హక్కు తెలంగాణకే అని కేటాయించారని అన్నారు. దురదృష్టం ఏంటంటే.. ప్రధానమంత్రి మోదీ మొదటి విూటింగ్‌లో ఆంధ్రాప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేతులో కీలుబొమ్మగా మారిపోయి ఆర్డినెన్స్‌ తెచ్చారు. వాస్తవానికి ఆర్డినెన్స్‌ తేవాల్సిన పరిస్థితి కాదు. శాసనసభలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రెఫర్‌ చేయకుండా కర్కషంగా ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వేరు చేశారు. బహుశా నేను అనుకుంటు ఈ దేశంలో ఫస్ట్‌ పర్సన్‌ క్రిటిసైజ్‌ మిస్టర్‌ నరేంద్ర మోదీ. ఈజ్‌ ద మోస్ట్‌ ఫాసిస్ట్‌ ప్రైమినిస్టర్‌ ఆఫ్‌ ద కంట్రీ అని చెప్పా. అప్పుడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని అన్నారు. . ఆ రోజు నాపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డరు.. ప్రమాణస్వీకారం మాత్రం చేయలే.. ఈ దశలో అధికారికంగా ఉండి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తరా? అంటే.. ఇస్తం తప్పదు.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపాలని చెప్పానని అన్నారు. అప్పుడు తెలంగాణ సమాజం నిరసన తెలిపింది. అనేక పర్యాయాలు చెప్పాం. మండలాల సంగతి వదిలేసినా ప్రాజెక్టునైనా ఇవ్వాలని ప్రధానికి లేఖలు రాశాం. ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రఘునందన్‌రావు సత్యదూరమైన విషయాలు చెప్పారు. సభను పక్కదోవ పట్టిస్తున్నరు. వందశాతం తప్పు. అంబేద్కర్‌ ఉండే ఎంత కొట్లాడునో.. ఇప్పుడు ఆయన లేరు మన దురదృష్టం. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుంది. అధికారి అనేది బాధ్యత. ఇది రాచరికం కాదు. బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి. రాజ్యాంగంలో కేంద్రం పరిధిలో, రాష్టాల్ర పరిధిలో ఉండాలి.. ఇద్దరు కలిసి సంప్రదించుకొని చేసుకునేందుకు కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఈ పవర్‌ ఉమ్మడి జాబితాలో ఉన్నది. దీనిపై కేంద్రం పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్టాల్రతో కనీస సంప్రదింపులు చేయకుండా.. అడగకుండా.. మాటమాత్రం చెప్పకుండా వాళ్ల ఇష్టం  వచ్చిన పద్ధతిలో.. పార్లమెంట్‌లో మాట్లాడనీయకుండా మూకదాడులు చేస్తున్నరు. ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వందమంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం. వారి నోళ్లను మూయించడం.. గందరగోళం సృష్టించి ఆ బిల్లులను పాస్‌ చేసుకుంటూ ఇలాంటి చట్టాలు చేస్తున్నరు. సమగ్ర పార్లమెంట్‌లో చర్చిస్తే అనేక పార్టీలు చర్చిస్తయ్‌. గతంలో బాల్క సుమన్‌ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను ఐదురోజులు స్తంభింప చేసినం. అయినా కూడా దానికి జవాబు లేదు. దానిపై చర్చ లేదు. కనీసం ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేదు. బూల్డోజ్‌ చేసి.. మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపే దుర్మార్గమైన పద్ధతి జరుగుతుందని  అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.
ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు
ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్టాల్రపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ’విూటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నది. గెజిట్‌ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదు.. మేము అనలేదు అంటున్నరు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంలో విూటర్‌ పెడితే రైతులంతా కుప్పలు పోసి.. ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసు కున్నం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తియ్యని మాటలు చెప్పారు. ఫ్రీ కరెంటు ఇస్తామన్నరు. అక్కడ విూటర్లు పెడితే మూడు నాలుగు జిల్లాల్లో రైతులంతా కరెంటు ఆఫీసుకాడ విూటర్లు పోసి.. పెద్ద ఎత్తున ఆందోళన లు జరిగాయి.. ఇంకా జరుగుతున్నయ్‌’ అని గుర్తు చేశారు. మిత్రుడు రఘునందన్‌రావు మా బీజేపీ పార్టీ పెట్టదని అంటున్నాడని.. పెట్టేది కేంద్ర ప్రభుత్వం కదా?.. విూ పార్టీకి.. ప్రభుత్వానికి ఏమైనా గ్యాప్‌ ఉందా? విూలోనే విూపైనే అపనమ్మకం ఉందా? విూరు చెప్పేది తప్పా? వాళ్లు చెప్పేది తప్పా? వాస్తవాలు ఇలా ఉన్నాయి. వచ్చిన గెజిట్‌ ఇది మరి అంటూ మండిపడ్డారు.  ఒక్క అగ్రికల్చర్‌ కనెక్షన్‌ కాదు.. ’ఏ రకమైనా కనెక్షన్‌ అయినా భారతదేశంలో విూటర్‌ లేందే ఇవ్వడానికి లేదు’ అని శాసించి, దీనికి వ్యతిరేకంగా పోతే ముమ్మల్ని తొక్కి సంపుతం అనే పద్ధతిలో మాట్లాడుతున్నరు. ఇది ఎట్ల రఘునందన్‌ రావు సమర్థిస్తరో.. విద్యుత్‌ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు. ఇది సంస్కరణలు కాదు.. పాడు కాదు. పేద ప్రజలను, కరెంటు వాడే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గపు చర్య అని అంటూ మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడుగు. ఇదే శాసన సభలో ఇంతకు ముందు చర్చించాం. ఈ సంస్కరణలు అమలు చేసిన వారికి పాయింట్‌ 5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామని చెప్పారు. ఇది అన్యాయమని చెప్పాను. పటిష్టమైన రాష్టాల్రకు వేరే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. విూరు అమ్మేయండి అని ఈ కేంద్రం వెయ్యి కోట్లు బహుమతి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు విూద లెటర్లు వస్తున్నయ్‌. ఎవరు ముందుగ అమ్మితే వారికి వెయ్యి కోట్ల బహుమానం అంటున్నరు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మాలని లెటర్లు పంపాలని ఆర్థికమంత్రి పంపారు. మొత్తం విూద మేం కూడా అమ్ముతున్నం కాబట్టి..విూరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నరని అంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇంధన ఖర్చులు తగ్గించుకొని ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం అన్నారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని, వ్యవసాయం, విద్యుత్‌ మాత్రమే మిగిలాయని ధ్వజమెత్తారు. ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం మాయ మాటలు చెబుతోందన్నారు. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్‌ కంపెనీలను రంగంలోకి దించాలని కేంద్రం ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని, కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడిరదని కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ధాన్యం కొనాలని అడిగితే కేంద్రమంత్రి అవహేళన చేశారని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

(తెలంగాణలో తొలి ఫారెస్ట్‌ యూనివర్సిటీ..
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్‌)
హైదరాబాద్‌: తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని..దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022కు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ కోసం అర్హులైన అటవీ వృత్తి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.పారిశ్రామిక, గృహ అవసరాల నుంచి వచ్చే డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు తోట పంటల ద్వారా ఉత్పత్తి చేసేలా తగిన పద్ధతుల అభివృద్ధి, పరిశోధనకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. సంప్రదాయక అటవీ వ్యవసాయంతో పాటు సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా వివిధ వ్యవసాయ, జీవావరణ పరిస్థితులకు అనుకూలమైన అటవీ వ్యవసాయ నమూనాలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరితహారం, ప్రకృతివనాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, నర్సరీలు, హరితనిధి కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టింది. హరితహారాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఫలితాలు పొందేలా కార్యాచరణ అమలు చేసేందుకు అవసరమైన అటవీ వృత్తి నిపుణుల లభ్యత ఉంటుందని తెలిపింది. రాష్ట్ర అవసరాలు, జాతీయ విధానాలకు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ శాస్త్రం, అటవీ నిర్వహణ, శీతోష్ణస్థితి శాస్త్రాల్లో నూతన కోర్సులతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించేలా అటవీ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. ఈ వర్సిటీకి తొలి వీసీని ఛాన్స్‌లర్‌ నియమిస్తారు. ఆ తర్వాత ఉపకులపతుల నియామకం సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా జరగనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై తొలుత మంగళవారం అసెంబ్లీలో, ఆ తర్వాత శాసనమండలిలో చర్చ జరగనుంది.కాగా  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభ మయ్యాయి. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావు మృతికి సంతాపంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. రెండు నిమిషాలపాటు సభ సంతాపం తెలిపింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్టియ్రల్‌ ఏరియా చట్ట సవరణ బిల్లులను మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి హరీశ్‌రావు, అటవీ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సంబంధించిన బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులును మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రవేశపెట్టారు. విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తిరస్కరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు`పర్యవసానాలపై లఘు చర్చను ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రారంభించారు. ఇదే అంశంపై మండలిలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి లఘు చర్చను ప్రారంభించారు. ఐదు రోజుల విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభ మయ్యాయి. అటవీ విశ్వవిద్యాలయం బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, విశ్వవిద్యాలయ సాధారణ నియామకాల బిల్లును, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వాహన పన్నుల సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్‌, సదరన్‌ పవర్‌ డిస్టిబ్యూష్రన్‌ కంపెనీ 21వ వార్షిక నివేదికను మంత్రి జగదీష్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.