మహానగరంలో ఉపాధ్యాయ సంఘాల మహా ధర్నా కరపత్ర ఆవిష్కరణ
కొత్తగూడ జూలై 5 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్ళ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నెల్లుట్ల భాస్కర్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం దారుణమైన నిర్లక్ష్యానికి గురవుతున్నది.తెలంగాణ విద్యారంగంలో 4 సంవత్సరాలుగా బదిలీలు,7 సంవత్సరాలుగా పదోన్నతులు లేవు.వేలాది సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయని 2021,2022 మార్చి నెలలో ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా బదిలీలు పదోన్నతులు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఆ మాట ఆచరణకు నోచుకోలేదు.ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ద్వారా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు గల అడ్డంకులు తొలగిపోయాయి.అయినప్పటి కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బదిలీలు పదోన్నతులు చేపట్టలేదు.విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాద్యాయఖాళీలను భర్తీ చేయడం లేదు.మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు.317 జి.వో ద్వారా నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదు.ప్రభుత్వం మాత్రం ఆడంబరంగా మన ఊరు మనబడి,ఆంగ్ల మాద్యమంలో బోధన వంటి కొత్త పథకాలు తీసుకొచ్చింది.కానీ ఈ పథకాలు సరిగ్గా అమలు కావడానికి బడులు సరిగ్గా నడవడానికి అవసరమైన మానవ వనరులను,మౌలిక సదుపాయాలను సమకూర్చడం లేదు.బడుల పర్యవేక్షణకు అవసరమైన ఎం ఈ ఓ,డి ఈ ఓ వంటి పోస్టుల భర్తీని పూర్తిగా అటకెక్కించింది.బడులు మొదలై నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్స్ అందలేదు.ఇలా చెప్తూ పోతే విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉంది.ఈ పరిణామాలు తెలంగాణ సమాజానికి క్షేమకరం కాదని,సమాజాన్ని వెనక్కి నడిపించడం అవుతుంది.కావున పై సమస్యల పరిష్కారం కోసం జులై 7న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద యు ఎస్ పి సి తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని,ఉద్యమాల ద్వారానే మన డిమాండ్స్ ను సాధించుకుందామని పిలుపునివ్వడం జరిగింది.ఈ కరపత్ర ఆవిష్కరణలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లక్ష్మయ్య,సాంబయ్య,వీరస్వామి,పొ ట్టయ్య,ప్రభాకర్,పుష్పనీలా,రాణి ,సుధాకర్,నర్సింగరావు బాబురావు,రమేష్,రాజకుమార్,కొ మరయ్య,రాంబాబు,వెంకటయ్య,ఆనంద్ రవి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.