మహానగర్‌ వ్యవస్థాపకులు పాంచజన్య మృతి

సంతాపం తెలిపిన సిఎం చంద్రబాబు,మంత్రులు
కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్ట్‌ సంఘాల వినతి
విజయవాడ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  సీనియర్‌ పాత్రికేయుడు, ఆంధ్రపత్రిక సంపాదకుడు పాంచజన్య(60) బుధవారం మృతి చెందారు. అదేరోజు సాయంత్రం విజయవాడలో అంత్యక్రియలు ముగిసాయి. శ్వాసకోశ వ్యాధితో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు రేప్లలె నాగభూషణం. పాంచజన్య ఆయన కలం పేరు. కలం పేరుతోనే ఆయన సుపరిచితులు అయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం అశ్వారావుపాలెంకు చెందిన పాంచజన్య జర్నలిజంపై మక్కువతో చివరి వరకు నిబద్దతో పనిచేశారు.  అవనిగడ్డలో విద్యాభ్యాసం చేశారు. గ్రావిూణ విలేకరిగా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించి సంపాదకుడి స్థాయికి ఎదిగారు. గతంలో ఈనాడు, ఉదయం దినపత్రికల్లో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌ కేంద్రంగా ‘మహానగర్‌’ పత్రికను స్థాపించి నిరాటంకంగా  నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆంధ్రపత్రికను పునఃప్రారంభించడంతో దానికి సంపాదకుడిగా కొనసాగుతున్నారు. ఆంధ్రపత్రికను తిరిగి ప్రారంబించానల్న తలంపుతో ఆయన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కాం మార్చారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, దేవినేని ఉమా, కాలువ శ్రీనివాసులు,జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌,బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  తదితరులు సంతాపం తెలిపారు. జర్నలిస్ట్‌ మిత్రులు, యూనియన్‌ నాయకులు ఆయన ఆస్పత్రిలో  ఉండగా అండగా నిలిచారు.  ఆయన కుటుంబానికి అన్నివిధాలుగా అండగా నిలుస్తామని మంత్రి దేవినేని ఉమ హావిూ ఇచ్చారు. ఆయన కుటుంబాన్‌ఇన ఆదుకోవాలని జర్నలిస్ట్‌ సంగాల నేతలు కోరారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ పాంచజన్య మృతికి సంతాపం ప్రకటించింది. చిన్నపత్రికల యాజమాన్యాలు కూడా సంతాపం ప్రకటించాయి. ఆయన మృతి పత్రికారంగానికి తీరని లోటని తెలపింది.