మహానుభావుల త్యాగఫలితమే తెలంగాణ విమోచనం.

నెరడిగొండసెప్టెంబర్17(జనంసాక్షి):
తెలంగాణ విమోచన దినోత్సవాన్నిపురస్కరించుకొని మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సోసయ్య హీరా సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు.వారు మాట్లాడుతూ భారతదేశానికి  స్వాతంత్రం వచ్చినా  తెలంగాణలోని హైదరాబాద్ నిజాం నవాబు చేతిలో బందిగా ఉండేదని,హైదరాబాద్ ను విలీనం చేయాలని అప్పటి నిజాం నవాబును కోరితే ఆ ప్రతిపాదనను తిరస్కరించి ప్రజలపై ఎన్నో రకాలుగా వేధించేవారు.రజాకార్ల సైన్యం అత్యాచారాలకు పాల్పడ్డారు. అప్పుడు చాకలి ఐలమ్మ, రాంజీ గోండు లాంటి వారు ఎందరో వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రజాకార్ల సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో దానికి తోడుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరిట భారత సైన్యం హైదరాబాద్ ను చుట్టుముట్టారు.తెలంగాణ విమోచనం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసారని అటువంటి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమం సమయంలో పదే పదే ప్రకటించిన ఆ మాటను మరిచిపోయారని,బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించగానే కేసీఆర్ విమోచన దినోత్సవం పేరు మార్చి సమైక్యతా వజ్రోత్సవాల పేరిట కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన ముమ్మాటికీ ఇది తెలంగాణ విమోచన దినోత్సవమనే విషయం ప్రజలకు అర్థమయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, ఓబిసి మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కపెల్లి రాములు, ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు నారాయణ, కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.