మహాభారత్ ధారావాహికలో టివి భీముడు ప్రవీణ్ మృతి
న్యూఢల్లీి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మహాభారత్ ధారావాహికలో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రవీణ్ కుమార్ మరణించినట్లు ఆయన కుమార్తె నికునికా వెల్లడిరచారు. సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు తన తండ్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె తెలిపారు. హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఢల్లీిలోని స్వంత ఇంట్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సిరీయల్‌లో భీముడి పాత్రతో ప్రవీణ్ దేశవ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ అతను నటించాడు.