మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో దర్శనాలు

విఐపి బ్రేక్‌ దర్శనాల నిలిపివేత: ఇవో

తిరుమల,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ నెల 11 నుంచి 16 వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్‌ తెలిపారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ సంప్రోక్షణ సమయంలో సర్వదర్శనం ద్వారా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నామని, అలాగే టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 6 రోజులలో 1.80లక్షల మంది భక్తులకు మూలవిరాట్టు దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు.ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్ర¬్మత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఉంటాయని, అలాగే 24 న తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో సింఘాల్‌ పేర్కొన్నారు.

 

తాజావార్తలు