మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. జిల్లా అడిషనల్ ఎస్పి రామదాసు తేజవతు

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పి రామదాసు తేజవతు అన్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, ఆదేశానుసారం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పై బాధితుల నుండి వచ్చిన అర్జిలను , జిల్లా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవత్ స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ ల అధికారులతో మాట్లాడుతూ పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అడిషనల్ ఎస్పీ ఆదేశించారు.
బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. అలాగే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల, మహిళలకూ వ్యతిరేకంగా జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో
భూ తగాదాలు 03
భార్యాభర్తల పిర్యాదులు 03
పరస్పర గొడువలు 06
మొత్తం 12 పిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.