మహిళలపైనేరాలు నియంత్రించ గలిగాం
అసెంబ్లీలో హోంమంత్రిసుచరిత
అమరావతి,నవంబర్22 (జనం సాక్షి): ఎపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం కాగా ..స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ… మహిళలపై జరిగే నేరాలను నియంత్రించగలిగామని తెలిపారు. 89 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. ప్రతి పిఎస్‌లో ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. దిశ చట్టంపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని సుచరిత పేర్కొన్నారు. కులగణనను తక్షణమే చేపట్టాలని కోరుతూ… అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాకృష్ణ వెనుకబడిన తరగతుల కులాలవారీ జనగణన పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుత సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు టిడిపి సభ్యులు ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.