మహిళలు ముందంజలో ఉండాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర జులై 20(జనం సాక్షి )మహిళాలను ఆర్థికంగా పైకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కెసిఆర్ పనిచేస్తున్నారని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు
బుధవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో శ్రీ తులసి మండల మహిళా సమక్య ఆధ్వర్యంలో 6వ మహాజన సభకు ముఖ్య అతిధిగా ఎంపీపీ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాలలో మరియు స్వయం సంఘాల ద్వారా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి సహకారంతో మండలనికి 3కోట్ల 75లక్షలు రూపాయలు తో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,5లక్షల 60 వేలతో పిండి మిల్లును మంజూరు ఐనాయని తెలిపారు.అంతేకాకుండా మండలంలోని 464 ఎస్ ఎహ్ జి గ్రూపులకు 15కోట్ల 30లక్షలు రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా ఈ సంవత్సరం మంజూరు మంత్రి చేయించారాని అన్నారు.
ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఏ ఏ పి డి ఎండీ,నూరోద్దీన్, ఎంపీడీఓ బి . వేణుగోపాల్ రెడ్డి,ఏపీఎం,నరేంద్ర, స్థానిక సర్పంచ్ వి,లక్ష్మి,ఎంపీటీసీ ఎదునూరి శ్రీనివాస్, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి,రాంచంద్రయ్య శర్మ,మండల సమక్య అధ్యక్షులు శ్రీరాం సుజాత, కార్యదర్శి ఉపేంద్ర, కోశాధికారి మంజుల, సీసీ లు పద్మ, సుజాత, సుధాకర్, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు