మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో “ఆజాది కి గౌరవ్ పాదయాత్ర”.
– వరద బాధిత మహిళలకు చీరల పంపిణి.
బూర్గంపహాడ్ ఆగష్టు12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం ఏఐసీసీ, టిపిసిసి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు పిలుపుమేరకు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకగా 75 కిమీ పాదయాత్ర చేస్తూ పినపాక నియోజకవర్గం, మండలం లో బి బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి అధ్యక్షతన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న జాతీయ జెండా ఊపి, జెండా చేత పట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియచేస్తూ “అజాది కి గౌరవ్ పాదయాత్ర” చేపట్టి గోదావరి వరదకు పూర్తి నిరాశ్రాయులు అయిన యస్ సి కాలనీ మహిళల కు చీరలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో బి బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసుపాక సావిత్రి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి, బర్ల సంధ్య, తదితర మహిళలు పాల్గొన్నారు.