మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ

బిజెవైయం పట్టణ అధ్యక్షుడు గజారాజుల తిరుమలేష్

బిజెవైయం ఆధ్వర్యంలో ఘనంగా
చాకలి ఐలమ్మ 128వ జయంతి.

వనపర్తి బ్యూరో సెప్టెంబర్26( జనంసాక్షి)

తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ అని బిజెవైయం పట్టణ అధ్యక్షుడు గజారాజుల తిరుమలేష్ అన్నారు.
మంగళవారం నాడు భారతీయజనతా యువమోర్చా ఆధ్వర్యంలో
ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి ని నిర్వహించారు.వనపర్తి పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూజా చేసి పూలమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేవైయం వనపర్తి పట్టణ అధ్యక్షులు గజరాజుల తిరుమలేష్ మాట్లాడుతూ,భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి,విముక్తి కోసం పోరాడే తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన దీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మను స్ఫూర్తిని తీసుకొని యావత్ తెలంగాణ ఉద్యమంలో సాధించుకోవడం జరిగింది నేడు సహకారమైన తెలంగాణ స్వరాష్ట్రంలో చాకలి ఐలమ్మని విస్మరించి,టిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిది ఏళ్లుగా గుర్తుకు రాని ఐలమ్మ జయంతి ఎలక్షన్ రాగానే తూతూ మంత్రంగా , ప్రభుత్వం వెంటనే ఐల్లమ్మ జయంతిని ఘనంగా నిర్వహించి ట్యాంక్ బండ్ మీద నిర్వహించాలని నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసు పల్లి ప్రతాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి నారాయణ, బిజెపి సంస్థాగత కార్యదర్శి కేతూరి బుడ్డన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి ,బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు , బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు , బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ దాసరాజు ప్రవీణ్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు శివారెడ్డి,జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కుమార్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుగురు రాములు, రాయన్న, నందిమల్ల రవి,ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ చారి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు విక్రమ్,నారాయణ కొమ్ము సామెల,రఘవేందర్ సాగర్ చుక్క సతీష్,తదితరులు పాల్గొన్నారు.