మహిళ కాళ్లు నరికి వెండి కడియాల అపహరణ

హైదరాబాద్‌, జనంసాక్షి: వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లు నరికి ఆగంతకులు దారుణంగా హత్యచేశారు. నగర శివారు కోకాపేట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోకాపేటలో శంకరమ్మ అనే మహిళ పాత సామాన్ల దుకాణం నిర్వహిస్తోంది . ఈ తెల్లవారుజామున మహిళ రెండు కాళ్లు నరికి దుండగులు వెండి కడియాలను ఎత్తు కుపోయారు.తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్మాప్తు చేపట్టారు. దుండగులు శంరమ్మకు పరిచయస్తులేనని భావిస్తున్నారు.