మహీ ‘సెంచరీ’ రికార్డు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అగ్రస్థానంలో నిలిచిన ధోనీ.. తన సారథ్యంలో జట్టుకు వందో వన్డే విజయం అందించాడు. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్పై టీమిండియాను గెలిపించడం ద్వారా మహీ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ధోనీ కెప్టెన్సీలో భారత్కిది వందో విజయం. స్వదేశంలోనూ, విదేశీగడ్డపై భారత్కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా మహీ ఇదివరకే చరిత్ర సృష్టించాడు. కాగా వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ధోనీ కంటే పాంటింగ్ (165), బోర్డర్ (107) ముందున్నారు. హ్యాన్సీ క్రానే (99), స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ (98) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.