మాకు అధికారమివ్వండి
` అధికారిక గీతంగా ‘జయజయహే తెలంగాణ’
` మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి
` క్షేత్రస్థాయిలో నేతలు కలసికట్టుగా పనిచేయాలి
` రాహుల్ యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు
` గాంధీభవన్‌లో కీలక నేతల భేటిలో రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ వచ్చాక ‘జయజయహే తెలంగాణ’ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ఆమోదిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్టాన్రికి ప్రత్యేక జెండా రూపొందించాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఐదు దశాబ్దాల పాటు మునుగోడు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే కార్యక్రమాలు, మునుగోడు ఉప ఎన్నిక, భారత్ జోడో యాత్ర అజెండా తదితర అంశాలపై నేతల సూచలను కోరారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన పేటెంట్‌ను భాజపా, తెరాస హైజాక్ చేస్తున్నాయ్.. ‘సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని భాజపా చూస్తోంది. ఇందుకోసం కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆనాడు రాచరిక పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్. మన పేటెంట్‌ను భాజపా, తెరాస హైజాక్ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్ తనకు అనుకూలంగా రాసుకొంటున్నారు. వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపైనే ఉంది. టీఆర్‌ఎస్‌కు పర్యాయపదంగా వాహనాల రిజిస్టేష్రన్ కోసం కేసీఆర్ టీఎస్ అని తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీన్ని సవరించి టీజీ పెట్టుకోవాలనేది ఒక ప్రతిపాదన ఉందని అన్నారు. సబ్బండ వర్గాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముంది. జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేక జెండా ఉండాలనే ప్రతిపాదనపై విూ సూచనలివ్వండి. మునుగోడు ఉప ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 8యూనిట్లుగా విభజించి నాయకులకు బాధ్యతలు నిర్ణయించాం. 300బూత్‌లను చూసుకోవడానికి 150 మందిని నియమించాలని పార్టీ భావిస్తోంది. ఇందులో అందరూ సమానమే.. చిన్న, పెద్ద తేడా ఏవిూ లేదు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ అడ్డగోలుగా ధనబలాన్ని ఉపయోగిస్తాయి. మనం క్షేత్ర స్థాయిలో తెరాస, భాజపాను ఓడిరచాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. రాహుల్‌కు వస్తోన్న ఆదరణ చూడలేకే భాజపా చిల్లర మల్లర ప్రచారానికి దిగుతోందని ధ్వజమెత్తారు. అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణకు రాబోతోందని పేర్కొన్నారు. 15 రోజులపాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడిరచారు. మక్తల్ నుంచి మద్నూర్ వరకు 350 కిలోవిూటర్లు యాత్ర సాగుతుందన్నారు. మక్తల్ వద్ద రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందన్న ఆయన..అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్?నగర్, శంషాబాద్, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్దశంకరంపల్లి, మద్నూర్ విూదుగా మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుందని తెలిపారు. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజక వర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రోజుకు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి యాత్రలో పాల్గొనే అవకాశం కల్పించాలని భావిస్తున్నామని తెలిపారు. మూడు పెద్ద సభలు నిర్వహించాలనుకంటున్నామన్నారు. విూ సూచనల ఆధారంగా వీటిపై నిర్ణయాలు తీసుకుంటామని అని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. సెప్టెంబర్ 17పై టీఆర్‌ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తమ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా కాదని, రాచరికానికి మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. 2023 సెప్టెంబర్ 17లోపు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.మునుగోడు ఎన్నిక విషయంలో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాయల్టీ వాళ్ళకే మునుగోడు టికెట్ దక్కిందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్.. శత్రువులను ఎదుర్కోవాలంటే మనం సమిష్టిగా పనిచేయా ల్సిందే అన్నారు. మునుగోడుకు ప్రతి ఒక్కరు వచ్చి పని చేయాలని తెలిపారు. మునుగోడు కోసం నేతలు ఎవరి ఖర్చు వల్లే భరించాలని సూచించారు. తోచిన కాడికి నేతలు పార్టీకి ఆర్ధికంగా సహకరించాలన్నారు. సెప్టెంబర్ 17తో టీఆర్‌ఎస్, బీజేపీలకు సంబంధం లేదని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశం మొత్తాన్ని ఏకతాటి విూదకు తీసుకురావడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో యాత్ర కు బ్రేక్ ఉంటుందని ఉత్తమ్ తెలిపారు.