మాజీ ఎంపీ పొంగులేటి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక, కానుక పంపిణీ
జూలూరుపాడు, ఆగష్టు 10, జనంసాక్షి: మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 17వ తేదీన ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ లో వైభవంగా జరుగనుంది. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వివాహ ఆహ్వాన పత్రికతో పాటు కానుకగా గోడ గడియారాన్ని అందించే కార్యక్రమాన్ని నాయకులు విస్తృతంగా చేపడుతున్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకూరి మధుసూదనరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సపావట్ నరేష్, టిఆర్ఎస్ నాయకులు లేళ్ల గోపాలరెడ్డి, మల్లెల నాగేశ్వరరావు, పోతురాజు నాగరాజు, ధారావత్ రాంబాబు, సాయిల కృష్ణయ్య, నర్వనేని పుల్లారావు, చిన్న నాగేశ్వరావు, కోట కుమార్ బాబు, సాయిల కృష్ణయ్య, గుగులోతు చంటి, కళ్యాణపు నరేష్, తాళ్లూరి లక్ష్మయ్య, వేమూరి కనకయ్య పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.