మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి ఆహ్వానిస్తున్న జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి) : ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామంలో బుధవారం శుభలేఖతోపాటు గోడ గడియారాన్ని అందజేస్తూ ఆహ్వానం పలికారు. ఈనెల 17న ఖమ్మంలో జరిగే రిసెప్షన్ కి మండల ప్రజలందరూ హాజరుకావాలని ఆయన కోరారు.