మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి సోదాలు
పలు సంస్థలతో ఒప్పందాల్లో అవకవతకలపై విచారణ
అమరావతి,డిసెంబర్10 జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించిన ఆయన యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు రావడంతో అతడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ఆచరణలో అవకతవకలు జరిగాయని గత సెప్టెంబర్‌లో సీఐడీకి ఫిర్యాదు చేశామని ప్రసుత్త స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒప్పంద సమయంలో లక్ష్మీనారాయణ కార్పొరేషన్‌కు సలహాదారుగా పనిచేశారని వివరించారు. ఒప్పందంపై లోతైన విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగు చేస్తాయని సీఐడీ అధికారులువెల్లడిరచారు. రిటైర్డ్ ఐఏఎస్, డాక్టర్ లక్ష్మీనారాయణను ఏపీ సీఐడీ ప్రశ్నిస్తున్నారు. 2017 జీవో ఎంఎస్`4 గురించి తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 8 మంది ఎండీలు మారారని, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న సమయంలో రిటైర్డ్ అయ్యానని తెలిపారు. సిమెన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదిరిందని ఏపీ సీఐడీ ప్రశ్నించారు. సిమెన్స్ వివిధ ప్రాంతాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, సిమెన్స్ మేనేజ్మెంట్తో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంవోయూ ఉందని, కార్పొరేషన్ రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని లక్ష్మీనారాయణ తెలిపారు.