మాజీ కార్పొరేటర్ దారుణ హత్య
అనంతపురం : నగరంలో మాజీ కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కులోకి ఉదయం నడకకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. గతంలో నక్సల్స్ ఉద్యమంలో పనిచేసిన అతను ఆ తర్వా అజ్ఞాతం వీడి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.