మాజీ క్రికెటర్ కనిత్కర్ మరణం

ముంబై: భారత మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(73) చనిపోయారు. భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన కనిత్కర్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా సేవలు అందించారు. మహారాష్ట్ర తరపున కూడా క్రికెట్ ఆడాడు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఫుణేలోని తన నివాసంలో మంగళవారం రాత్రి మరణించారు. కనిత్కర్ మరణం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సంతాపం తెలిపారు.