మాజీ భార్యను తీసుకురమ్మంటున్న హైజాకర్

5ఈజిప్టులో విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ ఉగ్రవాది కాదని సైప్రస్ అధ్యక్షుడు ప్రకటించారు. హైజాకర్ తన మాజీ భార్యను తీసుకురావాలని కోరుతున్నాడు. దీంతో, ఆమెను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, ఈజిప్ట్ లో హైజాక్ కు గురైన విమానం నుంచి నలుగురు సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు మినహా అందరినీ వదిలేసినట్లు ఈజిప్ట్‌ ఎయిర్‌ లైన్స్ ప్రకటించింది. కైరో నుంచి అలెగ్జాండ్రియా వెళ్తున్న ఈజిప్ట్‌ ఎయిర్‌ ఎంస్ 181 విమానాన్ని ఇబ్రహిం సమాహా అనే దుండగుడు హైజాక్ చేశాడు. అతని దగ్గర బెల్ట్ బాంబుతో పాటు మారణాయుధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విమానాన్ని బలవంతంగా సైప్రస్ దేశంలోని లార్నాక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేశారు. సైప్రస్ లో తనకు ఆశ్రయం కల్పించాలని, ప్రస్తుతం తనకు ఒక ట్రాన్స్ లేటర్ కావాలని హైజాకర్‌ డిమాండ్ చేస్తున్నాడు. సైప్రస్ ఎయిర్ పోర్ట్ దగ్గరకి చేరుకున్న అధికారులు.. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి, విమానాలను డైవర్ట్‌ చేశారు.