మాజీ సర్పంచుల డిమాండ్లను పరిష్కరించాలి.
మాజీ సర్పంచ్ ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ సర్పంచ్ ల సంఘం నాయకులు బొడ్డు దేవయ్య కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ సర్పంచుల డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న దీక్షలు శనివారం 32వ రోజు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన బొడ్డు దేవయ్య మాట్లాడుతూ మాజీ సర్పంచుల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాజీ సర్పంచుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. దీక్షలో మల్లయ్య గుమ్మడి కాంతయ్య ,రామిండ్ల మైసయ్య, దేవుని సుజాత, నల్ల గోవర్ధన్ చాడ మల్లారెడ్డి మేకల శ్రీనివాస్ యాదవ్ బుర్ర మల్లేశం గౌడ్, నందయ్య గౌడ్ ,నారాయణ, అల్వాల లక్ష్మణ్ పాల్గొన్నారు.