మాజీ సింగిల్ విండో ఛైర్మన్‌పై కాల్పులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మాజీ సింగిల్ విండో ఛైర్మన్ ప్రభాకర్‌రావుపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రభాకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిరిసిల్ల ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కారులో వెళ్లున్న ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.