మాతా, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
మాతా, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొంటు, వారం వారం సమీక్షించి సి సెక్షన్ తగ్గించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులు, గైనకాలజిస్ట్ లతో సి సెక్షన్ తగ్గించుటకు, మాతా, శిశు ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వారం సి సెక్షన్ పై సమీక్ష ఉంటుందని, మాతా, శిశు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే సి సెక్షన్ తగ్గించాలని తెలిపారు. నార్మల్ డెలివరీ జరిగేటట్లు చూడాలని, ఆశ, ఏ.ఎన్.ఎం. లతో అవగాహన కల్పించాలని, ప్రతి వారం సమీక్ష ద్వారా సి సెక్షన్ లు తగ్గించాలని, ఈ.డి.డి.క్యాలెండర్ వారీగా ఎంతమంది రావలసి ఉన్నది, ఎంతమంది వచ్చారు పరిశీలించాలని తెలిపారు. కె.సి.ఆర్.పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలనీ, వర్క్ షాప్ నిర్వహించుటకు స్టాఫ్ నర్స్ లు ఎంత మంది ఉన్నారనీ, డెప్యూటేషన్ లో ఉన్న ట్రెయిన్డ్ నర్స్ ల డిప్యూటేషన్ ను రద్దు చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పక్షం రోజులకోసరి పి.హెచ్.సి. లను జిల్లా వైద్య అధికారులు విజిట్ చేసి గైనకాలజిస్ట్ సేవలు అందించే వాటిపై గ్రామస్తులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏప్రిల్, మే, జూన్ నెల వారీగా ప్రైమి, నాన్ ప్రైమి, సి సెక్షన్, నార్మల్ డెలివరీ లు, ఏ.ఎన్.సి. నమోదు విషయమై సమీక్షించారు. గైనకాలజిస్ట్ ల, స్టాఫ్ నర్స్ వారీగా సి సెక్షన్, నార్మల్ డెలివరీ చేస్తున్న వివరాలతో కూడిన రిపోర్ట్ చేయాలని తెలిపారు. నార్మల్ డెలివరీ అయ్యే విధంగా యోగ, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేయించాలని, ఎం.సి.పి. కార్డ్ తీసుకొని వచ్చే విధంగా చూడాలని, స్లీప్ లను అనుమతించ రాదని తెలిపారు. రేడియాలజీ సేవలను వాడుకలోకి తీసుకొని రావాలన్నారు. అనేస్తేశియ డాక్టర్ లు ఎంతమంది ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో సి సెక్షన్ ఆడిట్ సందర్భంగా క్షుణ్ణంగా వివరాలను పరిశీలించాలని, హాస్పిటల్ వారీగా నార్మల్, సి సెక్షన్ జరిగిన వివరాలను పరిశీలించి నోటీస్ లను జారీ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ నుండి డాక్టర్ ల వరకు నార్మల్ డెలివరీ జరిగిన సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ సత్కరించాలని తెలిపారు. సబ్ సెంటర్ వారీగా పనితీరును పరిశీలించి నెలవారీగా ర్యాంకింగ్ ఇవ్వాలని, జిల్లాలో ఉన్న సబ్ సెంటర్ లలో ర్యాంకింగ్ తీయాలని, వరుసగా మూడు నెలల పాటు ర్యాంకింగ్ లో వెనకబడిన ఆశ, ఏ.ఎన్.ఎం. లు వివరాలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్రాములు, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్. ఓ. అంబరీష, ఉమా గౌరీ, వైద్య అధికారులు డాక్టర్ లు వీరన్న, వైదేహి, జ్యోత్స్న, నేతావత్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.