మాదిగల పోరాటం ఆగదు

విజయవాడ,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ సాధనకోసం మాదిగల ధర్మయుద్ధం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు వెల్లడించారు. వర్గీకరణ కోసం మంద కృష్ణమాదిగ నిర్వహించిన ఆందోళన

సందర్భంగా కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్గీకరణకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిల పక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. వర్గీకరణ సాధిస్తే రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఎంతోకాలంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనడానికి ఇదొక్కటే మార్గమని అన్నారు. ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా కళ్లు తెరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాలమహానాడు నాయకులు తమ జాతికి ఏమాత్రం ఉపకారం చేయకపోగా వివిధ వివిధ పార్టీల్లో ఉంటూ పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేపట్టనున్న పోరనాటాలతో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామనిపేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు కోటిమంది మాదిగలు, ఇతర ఉపకులాల కోసం ఎమ్మార్పీఎస్‌ పోరాటం చేస్తోందని తెలిపారు.

తాజావార్తలు