మాది రైతు సర్కార్
` రైతన్నలే మా ఆత్మ
` సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
` తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రసంగం
` అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు
` రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాల అమలు
` రికార్డుస్థాయిలో 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పతి
` తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది
` యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
` మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్‌గా నిలిచిందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రశంసించారు. మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణకు రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అని జిష్షుదేవ్ వర్మ కొనియాడారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పతి చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదని, ఒక భావోద్వేగ ప్రాంతమని, స్థిరత్వం, దృఢ సంకల్పానికి గుర్తు తెలంగాణ అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతివ్వడం వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని, దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. రైతులకు రుణమాఫీ చేశామని, ఇదే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని, రైతు నేస్తం అమలు చేస్తున్నామని, వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం నిలిచిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణి కల్పిస్తున్నామని జిష్షుదేవ్ వర్మ వివరించారు. ఘనమైన సంస్కృతి నిలయం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారన్నారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్ వెల్లడిరచారు. ల్గªతులకు మద్దతివ్వడం, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. దేశంలోనే ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని.. ఇదే రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోందన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని, తెలంగాణ భౌగోళిక పాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ స్థిరత్వం, దృఢసంకల్పానికి గుర్తు అన్నారు.రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందన్నారు. 260లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి ఓ సాక్ష్యమన్నారు. రూ.2లక్షల పంట రుణమాఫీని అమలు చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం చేసిన వాగ్దానాల నిర్దిష్ట కాల అమలుకు సాక్ష్యమన్నారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత లభిస్తోంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అగశ్రేణి శిక్షణ అందుతోంది. సివిల్ సర్వీసు పరీక్షల ఆశావహుల కోసం రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం తెచ్చాం. గతేడాది 55 వేల మందిగా పైగా యువత పభుత్వోద్యోగాలు పొందారు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ రూ.10 లక్షల వరకు పెంచాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించాం. ఎస్సీ ఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రవేశపెట్టనున్నామని గవర్నర్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు.
గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు
` గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లా గవర్నర్ ప్రసంగం:కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌విూట్‌లా గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ విూడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన 420 హావిూలు ఈ ప్రభుత్వం, ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని అనుకున్నామన్నారు. ’గత 15నెలల పేలవమైన, అట్టర్‌ఎª`లాప్ పరిపాలన గురించి ప్రాయశ్చిత్తం చేసుకునేవిధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని భావించాం. ఇది గవర్నర్ ప్రసంగం లేదు. ఒకమాటలో చెప్పాలంటే గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌విూట్‌లా ఉంది తప్పా.. గవర్నర్ ప్రసంగంలా లేదు. గవర్నర్ నోటి వెంట ఒకటికాదు రెండు చాలా అబద్దాలు చెప్పించారు. గవర్నర్ నోటివెంట అసత్యాలు పలకాల్సి రావడంపై బాధపడుతున్నాం. కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్ల ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నయ్. ఇప్పటికే 480 పైచీలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఒక మాట రైతులకు స్వాంతన చేకూర్చే, ఉపశమనం, భరోసా ఇచ్చేమాట గవర్నర్ నోటినుంచి వస్తుందేమోననని ఆశించాం. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం. పంటలకు నీరు ఇస్తాం. బుద్ధి తెచ్చుకున్నాం. ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాట చెబుతారని అనుకున్నాం. వారి నోటివెంట ఒక్క మాట రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25శాతం నుంచి 30శాతానికి మించి రుణమాఫీ జరుగలేదు. దీనిపై పోయిన శాసనసభలో ప్రభుత్వాన్ని అడిగినం. సీఎం సొంత ఊరికి పోదామా? సొంత నియోజకర్గానికి పోదామా? ప్లేస్, సమయం విూ ఇష్టం.. ఊరు విూష్టం అని చెప్పాం. ఒక ఊరిలో వందశాతం రుణమాఫీ జరిగితే మేం అందరం రాజీనామా చేస్తామని చెప్పాం. కానీ, మళ్లీ ఈ రోజు గవర్నర్ నోటివెంట రుణమాఫీ అయిపోయింది.. లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నరని గవర్నర్‌తో అబద్దాలు చెప్పించి.. గవర్నర్ స్థాయిని సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని, నీచత్వాన్ని బయటపెట్టుకుంది’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. పెట్టుబడి సాయం అందని రైతులు, రుణమాఫీ కాక.. కేసీఆర్ హయాంలో ఉన్న రైతుబంధును సైతం కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే.. రైతుబంధు మొత్తం అందింది.. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు సహాయం చేస్తున్నామని గవర్నర్ నోటి వెంట అబద్దాలు చెప్పించడమంటే గవర్నర్‌కు కూడా అవమానం. గవర్నర్ దీన్ని గుర్తించాలి. సాగునీటి సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతుంది. కేసీఆర్‌పై ద్వేషంతో, బీఆర్‌ఎస్‌పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా 15నెలలు ఎండపెట్టడం వల్ల గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్‌రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్‌రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. పంట ఎండిపోయి రైతులు అవస్థలుపడుతున్న రైతులు.. పంటలకు నిప్పుపెట్టుకుంటున్నరు రైతులు, పొలాల్లో గొర్రెలు మేకలను మేపుతున్న రైతులు గవర్నర్ ప్రసంగం నుంచి ఒక్క మాట కోసం ఇవాళ ఎదురుచూశారు. మేం పంటలు ఎండిపోకుండా కాపాడుతాం.. మేం ఉన్నాం.. ఈ ప్రభుత్వం విూకు భరోసా ఇస్తుంది. మేడిగడ్డను రిపేర్ చేస్తాం. ఇన్నిరోజులు కేసీఆర్‌పై కోపంతో తప్పు చేశామని ప్రాయశ్చిత్తం చేసుకుంటరనుకున్నామని.. కానీ, ఆ సోయి ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం ఒక మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు, సాగునీటి సంక్షోభం.. 480 మంది రైతుల ఆత్మహత్యలపై ఒక్కమాట మాట్లాడకపోవడం అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎట్ల ఉన్నయో దీన్ని బట్టే తెలుసుకోవచ్చని అంటూ కేటీఆర్ విమర్శించారు.
సంక్షేమాన్ని ఓర్వలేకే విమర్శలు :కాంగ్రెస్
హైదరాబాద్‌్(జనంసాక్షి):వర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేకుండా పోయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గబీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని, వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వారి తీరును గమనిస్తున్నారని, విపక్షంగా వారు సరిగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని ఐలయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి కీలక నిర్ణయాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే, ఈ కులగణనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు పాల్గొనకపోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కాలేశ్వరం ప్రాజెక్టు పేరు విూద భారీగా కమిషన్లు దండుకున్నారని బీర్ల ఐలయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తుందని, గత 10 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్ మిగిల్చిన అప్పులను తగ్గించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, కొత్త పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చినట్లు బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. పింక్ పార్టీ సోషల్ విూడియా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను అడ్డుకోవడం బీఆర్‌ఎస్ ఆలోచనగా మారిందని అన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్రం తల్లికి స్మారకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, కానీ కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రతి అంశంలో కమిషన్ల కోసం పనిచేసిన బీఆర్‌ఎస్ ఇప్పుడు అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులు, అవినీతి, పాలనలో చేసిన పొరపాట్లను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ అసలు రూపాన్ని అర్థం చేసుకుని, రాబోయే రోజుల్లో సరికొత్త పాలన కోసం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.