మానవత్వాన్ని చాటిన టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్

దౌల్తాబాద్ మండలపరిధిలో కోనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ గత ఐదు నెలల క్రితం ముబారస్ పూర్ చౌరస్తా లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు ఆ కుటుంబాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సయ్యద్ రహిమోద్దిన్ కలసి పరామర్శించారు. ఆ నిరుపేద కుటుంబాన్ని చూసి చలించి ఆ కుటుంబంలో ఏడవ తరగతి చదువుకునే బాబు కు,నాలుగో తరగతి చదువుకునే పాప ను చదువిస్తామని అన్నారు.ఈరోజు వాళ్లిద్దరికీ ఈ విద్యా సంవత్సరానికి సరిపడే నోట్ బుక్స్,బ్యాగ్ ,పెన్సిల్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉమ్మడి నరసింహారెడ్డి టిఆర్ఎస్ నాయకులు సయ్యద్ ఖాళీలోద్దిన్, జనార్దనరెడ్డి, దాసరి చంద్రం, రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area