-మారెడుమాన్ దిన్నె లో ఘనంగా బోనాల పండుగ.

-గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి.
-జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు30(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నే గ్రామంలో మంగళవారం బోనాలు పండుగ ను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని పెద్దలు,మహిళలు బోనాల తో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతల కు మొక్కులు తీర్చుకున్నారు.ఈ ఉత్సవాలలో జడ్పీటీసీ మేకల గౌరమ్మ ముఖ్య అతిథిగా హాజరై పోచమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ముఖ్యంగా పిల్లలు, పశుపక్షాలు,పాడిపంటలు వృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో గ్రామంలోని ప్రతి కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు మేకల చంద్రయ్య,ఉప సర్పంచ్ శ్రీధర్ రావు సింగల్ విండో డైరెక్టర్ సి బాలయ్య, మాజీ సర్పంచ్ వీరపాగ అరవింద్,టిఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్ చిన్న బాలయ్య వార్డు మెంబర్స్ దాసర్ల శివ, రేణుక రాముడు,ఎం,సుధాకర్,ఆంబోతు పీక్ల, రాజు, బీమా, జె. రవి,నాగరాజు, ముడావత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.