మార్చి టెన్త్ తరవాతే అడుగులు
విపక్షాల ఐక్యతకు అదే డెడ్‌లైన్
బిజెపి ఓడితేనే విపక్షాలకు ఆయువు
ఐదు రాష్టాల్ర ఫలితాల కోసం ఎదురుచూపు
న్యూఢల్లీి,మార్చి3(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరవాత విపక్షాల ఐక్యతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సిఎం కెసిఆర్ ఢల్లీిలో మకాం వేసినా..పికె సలహాలు ఇచ్చినా యూపిలో బిజెపికి ప్రతికూల ఫలితాలు వస్తేనే వీరి ఫ్రంట్ ముందుకు సాగుతుంది. ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా ఉంటే తప్ప కెసిఆర్ దూకుడు పెంచే అవకావం రాదు. అప్పుడే దేశంలో విపక్ష ఫ్రంట్ ఏర్పడడానికి అవకావం ఉంటుంది. దానికి తెలంగాణ వేదిక కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం కూడా అప్పుడే ఖరారు అవుతుంది. పదిన ఫలితాలు వచ్చిన తరవాతనే విపక్ష పార్టీల హడావిడి మొదలవుతుంది. అయిదు రాష్టాల్ర
ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీల సమావేశానికి ఢల్లీి వేదిక కానుంది. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు అప్పుడే మొదలవుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు కూడా అప్పుడే మొదలవుతుంది. బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.
.ఇప్పటికే టీఆర్‌ఎస్,టీఎంసీ,డీఎంకే,ఎన్సీపీ, శివసేన ,ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలసి ముందుకు నడవాలని నిర్ణయించాయి. ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేపట్టాయి. ఇందులో భాగంగా త్వరలో ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యేందుకు కెసిఆర్ అడుగు వేశారు. తాజాగా ఆయన ఢల్లీిలోనే మకాం వేశారు. బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తులను కూడగట్టాలని చూస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు జరుగుతుంది. ఇందుకోసం ప్రశాంత్ కిశోర్ కూడా ఎజెండా ఖరారు చేసే పనిలో పడ్డారని సమాచారం. దేశంలో 5 రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా ఫలితాలు ఉండకపోవచ్చని బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. అయినా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే ప్రాంతీయ పార్టీల సమావేశం ఉండే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు రాకపోతే..ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢల్లీి సీఎం కేజీవ్రాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉథ్దవ్ థాకరే లాంటివారు బీజేపీయేతర ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు