మార్పు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, నవంబర్‌ 26 : మాతా, శిశుమరణాలు తగ్గించేందుకు ఉద్దేశించిన మార్పు కార్యక్రమం పకడ్బందిగా అమలు చేయుటకు సిబ్బందికి పూర్తి అవగాహన కలించాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ క్లస్టర్‌స్థాయి, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మార్పు కార్యక్రమంపై క్లస్టర్‌ స్థాయిలో జిల్లా అధికారులు క్లస్టర్‌ కన్వర్జెంట్‌ అధికారులుగా నియమించినట్లు, 20క్లస్టర్‌లలో వివిధ శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత అధికారులు, సిబ్బందికి అవగాహన కలిగించినట్లు తెలిపారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లు, ఐ.కె.పి., ఆర్‌డబ్ల్యు.ఎస్‌. వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్‌, స్త్రీ శిశు సంరక్షణ శాఖ సిబ్బందికి ఈ నెల 27 నుండి 30వరు అనువైన తేదీల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించి అవగాహన కలుగచేయాలన్నారు.   ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించేలా క్లస్టర్‌ కన్వర్జెంట్‌ అధికారులు పర్యవేక్షించి సమావేశాలకు హాజరుకావాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో అదరను జెసి సుందర్‌ అబ్నార్‌, డిఆర్‌డిఏ పి.డి.జె.శంకరయ్య, స్త్రీ శిశుసంక్షేమ శాఖ పిడి. రాములు తదితరులు పాల్గొన్నారు.