*మావోయిస్టుల ప్రలోభాలకు లోనుకావద్దు: డీఎస్పి బోనాల కిషన్*
కాటారం డిఎస్పి బోనాల కిషన్, మహాదేవపూర్ సిఐ కిరణ్, SI కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు మరియు సిబ్బందితో కలిసి పలిమెల మండలంలోని దమ్మురు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డిఎస్పి కిషన్ మరియు సిఐ కిరణ్ గ్రామస్తులతో మాట్లాడుతూ
మావోయిస్ట్ లు వచ్చారని సమాచారం ఉన్నందున అందరు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, అనుమానిత వ్యక్తులు మరియు సంఘ విద్రోహక వ్యక్తులు ఎవరైనా గ్రామం లోకి వస్తె వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించినా లేదా వారికి సహకరించినా వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టులు గోదావరి నది దాటే అవకాశం ఉన్న ఇచ్చంపల్లి, బండారు గూడెం వద్ద ఫెర్రీ పాయింట్ల ను తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలు, వరదల కారణంగా జ్వరం, మలేరియ, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోనీ తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దమ్మురు గ్రామంలో వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులతో కాసేపు వాలీబాల్ ఆడి వారిని ప్రోత్సాహంగా వాలీబాల్ కిట్ల గురించి దమ్మురు మరియు బూరుగూడెం క్రీడాకారులకు డబ్బులు ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ముకునూర్ గ్రామంలోని పిల్లలకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మావోయిస్టుల సిద్ధాంతాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు