మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థ దమ్ముంటే నిషేదం ఎత్తివేయాలి: విరసం

కాశీబుగ్గ: మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దమ్ముంటే ఎత్తివేయాలని విరసం నాయకులు కళ్యాణరావు, వరవరరావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో తొలితరం మావోయిస్టు నేత గోరు మాదవ రావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో తొలితరం మావోయిస్టు నేత సంస్మరణ సభ సందర్భంగా విలేకరులతో మాట్లడారు. ఇంకా పూర్తిగా రూపాంతరం చేందని ఆర్డీఎఫ్‌ (రాడికల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌) పై నిషేధిత అంక్షలు విధించడం ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ప్రజల క్షేమాన్ని కోరి, ప్రజాదరణ పొందిన మావోయిస్టు పార్టీని నిషేధిత పార్టీగా పేర్కొనడం తగదన్నారు. ఎందుకు నిషేధం విధించారో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీజీపీ దినేష్‌ రెడ్డిలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గోరు మాధవరావు సంస్మరణ సభ లో వక్తలు మాట్లాడారు. విప్లవోద్యమంలో ఆయన చేపట్టిన పోరాటాన్ని సంస్మరణ స్మరించుకున్నారు. ఆర్డీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్‌ కిషోర్‌, విరసం సభ్యులు చలసాని ప్రసాద్‌, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు విప్లవకారులు పాల్గొన్నారు.