‘మా బోర్డు కంటే బీసీసీఐ నయం’

spoకోల్కతా: వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ డ్వెన్ బ్రావో, కెప్టెన్ డారెన్ స్యామీ తరహాలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు ఎక్కుపెట్టాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని బ్రావో అన్నాడు.

విండీస్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతిలో లేవని బ్రావో విమర్శించాడు. టి-20 ప్రపంచ కప్ గెలిచినా బోర్డు అధికారులు లేదా డైరెక్టర్లు తమకు ఫోన్ కూడా చేయలేదని చెప్పాడు. తాము ప్రపంచ కప్ గెలుస్తామని బోర్డు అధికారులు నమ్మలేదని, గెలవాలని కోరుకోలేదని వ్యాఖ్యానించాడు. తమ బోర్డు కంటే బీసీసీఐ ఎక్కువ ఉపయోగపడిందన్నాడు. ఈ ఏడాది తమకు అంతర్జాతీయ టి-20 మ్యాచ్లు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. జీతాల విషయంలో విండీస్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.