మా భూమిని మాకు ఇప్పించండి.

నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ ను ఆశ్రయించిన భూ బాధితులు.
తొర్రూరు 25 జూన్( జనంసాక్షి )
మండలంలోని అమ్మాపురం శివారు కొత్తగూడెం గ్రామానికి చెందిన కడారి లక్ష్మి అనే వృద్ధురాలికి ఖానాపురం శివారు సర్వే నెంబర్ లో 164/Aలో ఎకరాం 32 గుంటల భూమి పట్టాతో పాటు,పహాని 1/B ఉన్నప్పటికీ గత కొద్ది సంవత్సరాల నుండి కడారి లక్ష్మి,సునీత సాగు చేసుకుంటున్నారు.ఆ భూమిని ఈ మధ్యకాలంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అదే గ్రామానికి చెందిన కడారి నరసింహారెడ్డి,జయసింహ రెడ్డి,సూరం ఉపేందర్ రెడ్డి,రాంరెడ్డి,లక్ష్మారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,యాకుబ్ రెడ్డిలు కుమ్మక్కై భూకబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ…ఇదేమిటని ప్రశ్నిస్తే…తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని,భూ బాధితురాలు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్,జిల్లా కలెక్టర్ శశాంక,తొర్రూరు తహసిల్దార్ రాఘవ రెడ్డి,తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు ఎవరు పట్టించుకోవడంతో భూ బాధితులు శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ.అక్షరజ్ఞానం లేని వారిని ఆసరాగా తీసుకొని,భూ కబ్జా చేయడం సరికాదని,ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి,భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సునీత తదితరులు పాల్గొన్నారు.