మిర్చి రైతులకు స్టోరేజీలను అందుబాటులోకి తేవాలి

గుంటూరు,జనవరి5(జ‌నంసాక్షి): మిర్చి రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ధర తగ్గిపోతుందని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుందామంటే వాటి యజమానులు కూడా ఇష్టారాజ్యంగా అద్దెలు పెంచారని జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాధాకృష్ణ విమర్శించారు. కు అక్రమంగా వసూళ్లు చేస్తున్నా అధికారులు, పాలకవర్గం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధిక కవిూషన్‌, మచ్చుల పేరుతో మిర్చియార్డులో అధిక వసూళ్ల దోపిడీని అరికట్టాలని అన్నారు. ఇప్పటినుంచే చర్యలు తీసుకుని వచ్చే మార్కెట్‌ నాటికి పక్కా ప్రణాళిక అమలు చేయాలన్నారు.  కోల్డ్‌స్టోరేజ్‌లో సన్న, చిన్నకారు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలని, మార్క్‌ఫెడ్‌కు వేయి కోట్లు కేటాయించి కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నారు. అలాగే  కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు రూ.50 వేలు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు.