మిర్యాలగూడలో అన్యక్రాంతమైన వక్ప్ భూములపై సిఐడి అధికారులు విచారణ..

మిర్యాలగూడ జనం సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్యక్రాంతమైన  వక్ప్  భూములపై విచారించేందుకు నలగొండ సిఐడి డీఎస్పీ ఎర్ర్ణ నేతృత్వంలో సిఐడి సీఐలు నాగరాజు, జానకి రాములు, ఎస్సై నాగార్జునల బృందం బుధవారం పరిశీలన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం సిఐడి అధికారులు పట్టణంలోని
 వక్ప్ బోర్డు అనుబంధ  మస్జిదే- ఏ_ సారాయే మీరాలం పరిధిలో ఆక్రమణ గురైన రెండు వందల నలభై రెండు గజాల భూమి స్థలాన్ని పరిశీలించారు. సర్వేయర్ ద్వారా కొలతలను తీసుకున్నారు. అనంతరం పట్టణంలోని  కుండలబజార్ గల మదీనా కాంప్లెక్స్ (ఆషార్ ఖానా_ పీర్ల గొట్టం) పరిధిలోని 2954 గజాల భూమి అన్యక్రాంతమైన విషయంపై విచారించారు. విచారణలో నల్గొండ సిఐడి విభాగం కానిస్టేబుల్ నరసయ్య, మిర్యాలగూడ ఆర్ఐ శ్యాంసుందర్, సర్వేయర్ ఖాద్రి, మస్జిద్ కమిటీ మెంబర్లు, మన్నాన్, యూసుఫ్ అలీ, ఎండి ఫక్రుద్దీన్, తోపాటు ఆరిఫ్ అలీ, అబ్దుల్ ఖాదర్, తదితరులున్నారు.