*మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలతో బయ్యారం రోడ్లు అస్తవ్యస్థం*

పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది
బయ్యారం, జూన్ 21(జనంసాక్షి):
బయ్యారంలో మిషన్ భగీరథ  పైపులైన్ పేరిట రొడ్లకి ఇరువైపులా జెసిబి తో తవ్వి పైపులైన్ వేయడం, పైపు లైన్ కంధకాలలో నీరు నిల్వ పాదచారులకి,వాహనదారులకి  పలు ఇబ్బందులకు గురవుతున్న సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ చోద్యం చూస్తున్నారని బయ్యారం టౌన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
ప్రజల ఇబ్బందులు పాలకులకి పట్టవా అని ప్రశ్నించారు.
మిషన్ భగీరథ పైపులైన్ పేర బయ్యారంలో 6000 పైచిలుకు జనాభా గల మేజర్ గ్రామపంచాయతిలో ఒకే వాటర్ ట్యాంక్ ఉండడం, రెండు మూడు రోజులకు ఒక సారి మంచినీటిని సప్లై చేస్తూ ఉండడం ప్రజల దాహార్తి ని తీర్చుటకు కొత్తగా వాటర్ ట్యాంక్ 2022 మార్చి నేలలో పూర్తి అయినప్పటికీ వర్షాకాలం లో రెండు మూడు నెలల తరువాత పైపులైన్ వేయడం వల్ల రోడ్లు బురద మయం అయ్యాయని,
దీనికి కారకులు ఎవరు అంటూ ధ్వజమెత్తారు.ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని
తక్షణమే సంబంధిత అధికారులు కాంట్రక్టర్ పై చర్యలు తీసుకోవాలని,
లేని యెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.