ముంచెత్తుతున్న వర్షాలు
విద్యాసంస్థలకు సెలవులు
బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి) అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ అంచనా వేయడంతో కోస్తా కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు అధికారులు పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచారు.