ముందంజలో ఉన్న హిల్లరీ..!!

ఒక శాతం తేడా నుంచి 12 శాతం దాకా.. తొలి నుంచీ ట్రంప్‌ కన్నా ముందంజలోనే ఉంటున్న హిల్లరీ క్లింటన్‌ ఎన్నికల రోజుకు కూడా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. వాల్‌‌స్ట్రీట్ జర్నల్‌/ఎన్‌బీసీ న్యూస్‌ తాజా పోల్‌లో తేలిందిది. ఎలక్టోరల్‌ కాలేజీలో ఆమెదే స్పbabaష్టమైన ఆధిక్యత అని ఈ పోల్‌లో వెల్లడైంది. మరో ప్రముఖ ఒపీనియన్‌ పోల్‌ వెబ్‌సైట్‌ ‘ఫైవ్‌థర్టీఎయిట్‌’.. హిల్లరీ గెలిచే అవకాశం 65.3% ఉందని ఢంకా బజాయించి చెబుతోంది. ఎన్నికల్లో గెలుపునకు 270 ఎలక్టోరల్‌ ఓట్లు అవసరం కాగా.. హిల్లరీకి 291.9 ఓట్లు వస్తాయని, ట్రంప్‌కు కేవలం 245.3 ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే వస్తాయని మరొక అంచనా.