ముందస్తుకు పోతే.. 

టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదు
– బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం లక్ష్మణ్‌ ఓటీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ..  కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్‌ ఆశపడ్డారని, కానీ సభ అట్టర్‌ ప్లాప్‌ అయిందని అన్నారు. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం స్థానంలో ఉండి ప్రదానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. టీఆర్‌ఎస్‌ సభ హౌస్‌ ఫుల్‌, కలెక్షన్‌ నిల్‌లా జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాధించేందేవిూ లేదని అన్నారు. సీఎం మాటల్లో బలం లోపించిందని, దశదిశ లేదని ఆయన విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోతే.. టీఆర్‌ఎస్‌కు ముందస్తు పరాభవం తప్పదని లక్ష్మణ్‌ అన్నారు. జోనల్‌ వ్యవస్థ బిల్లుకు ప్రధాని ఆమోదం తెలిపితే.. కనీసం కృతజ్ఞత లేకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్‌ను తిరస్కరిస్తున్నారని లక్ష్మణ్‌ అన్నారు.
————————-