ముందస్తు అరెస్టులు సరికావు’ పి డి ఎస్ యు

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 07) జనం సాక్షి. ప్రగతి భవన్ ముట్టడి వాయిదా పడిన ఆగని అరెస్టులు . ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పాలేరు డివిజన్ కార్యదర్శి మాగి రాకేష్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషను నందు అక్రమ అరెస్టు చేయడం జరిగింది .అరెస్టు అప్రజాస్వామికం.
డిసెంబర్ 7న ప్రగతి భవన్ ముట్టడి వాయిదా .
పెండింగ్ లోనున్న ఫీజు రీయింబర్స్మెంట్
స్కాలర్షిప్స్ విడుదల చేయాలి
ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు దోపిడిని అరికట్టాలి.
నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి ,
శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్య సంస్థలను రద్దు చెయ్యాలి.
జాతీయ నూతన విద్యావిదానాన్ని అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేయాలని న్యాయమైన డిమాండ్లతో ముట్టడి చేస్తున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వలన పొగ్రం వాయిదా వేసుకున్నామని అయినా అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదు. మళ్లీ డేట్ ముందస్తు ప్రకటిస్తామని విద్యారంగ సమస్యల మీద ప్రగతి భవన్ ముట్టడిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం పిడిఎస్ యు మండల నాయకులు మాగి గణ, త్రివేణి కొత్త, మాగి జస్వాంత్ నాయకులని అరెస్ట్ చేశారు. బేషరతుగా విడుదల చేయాలనీ వారు అన్నారు.