ముంబయి దాడుల్లో అసువులుబాసిన వారికి నివాళి ఈ ఉరి: ఉజ్వల్ నికమ్
ముంబయి: ఆనాడు ముంబయి దాడుల్లో అసువులు బాసిన వారందరికి సపైన నివాళి నేడు కసబ్‌కు ఉరిశిక్ష అమలుచేయడమని కసబ్ కేసులో పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. ఇది దేశం సాధించిన విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. కసబ్‌ను పట్టుకుని, విచారించి, శిక్ష విధించి, అమలుచేయడం.. ఈ మొత్తం విధానం ద్వారా భారత్ అంటే ఏమిటో చూపామని. తీవ్రవాద ఘాతుకాలను మనం సహించబోమని, దోషులకు తగిన శిక్ష విధించడంలో వెనకాడబోమని ప్రపంచానికి తెలియజేశామని ఆయన పేర్కొన్నారు. సెషన్స్ కోర్టు, హైకోర్టుల్లో ఈ కేసు వాదించిన నికమ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యంకి సహాయకునిగా వ్యవహరించారు.