ముఖ్యనేతలను కమిటీలో కమిటీలో చేర్చాలి:పాల్వాయి
హైదరాబాద్:ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సమీక్షించేందుకు మంత్రి ధర్మాన కమిటీ వేయడం కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఉప ఎన్నికల్లో నాయకత్వం వహించి ఓడిపోయిన వారికి ఇలాంటి బాద్యతలు కట్టబెట్టడం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నారు.పార్టీ ముఖ్యనేతలను కూడా కమిటీలో చేర్చాలని కోరారు.తెలంగాణలో చేపట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టును వెంటనే రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరం కూడ తడవకపొగా నిర్మాణం వల్ల కోట్ల నిదులు వృధా అవుతాయన్నారు.రద్దుకోసం తెలంగాణ ప్రాంత ఎంపీలు ప్రధానికి లేఖరాసినట్లు చెప్పారు.నాగార్జున సాగర్ నుంచి కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయడం దురదృష్టకరమన్న ఆయకట్టు కోసం శ్రీశైలం నుంచి విడుదల చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు.