ముఖ్యమంత్రికి విద్యుత్‌ సమస్యపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెరాస అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కృష్ణా డెల్టా రైతుల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేసిందన్నారు. తెలంగాణ రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ఫ్రభుత్వం తక్షణమే అదనపు విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నారు. కేరళ వంటి చిన్న రాష్ట్రాలు కూడా విద్యుత్‌ కేటాయింపుల్లో పెద్ద వాటాను తీసుకుంటున్నాయని, విద్యుత్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్‌ తన లేఖలో డిమాండ్‌ చేశారు.