ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పాల బాలరాజు
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 01 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు పాల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆకునూరు గ్రామానికి చెందిన పోలోజు నరసింహ చారికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన 21వేల రూపాయల చెక్కును వారికి అందజేశారు. వారి వెంట ఆకునూరు బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు బీర రాములు, టీఆర్ఎస్ యూత్ గ్రామ కార్యదర్శి బోయిని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.