మునుగోడులో బహిరంగ సభకు వెళ్లిన స్థానిక నేతలు
టేకులపల్లి, ఆగస్టు 21( జనం సాక్షి): మునుగోడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా బహిరంగ సభకు టేకులపళ్లి బీజేపీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆదివారం 20 మంది నాయకులతో కలిసి బయలుదేరి వెళ్లారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బాగా వేయనున్నదని వారన్నారు. బహిరంగ సభకు వెళ్లిన వారిలో మండల ఉపాధ్యక్షులు రాములు నాయక్, యువమోర్చ్ అజయ్ నాయక్, ప్రధాకార్యదర్శి భూక్యా రమేష్ నాయక్, చిక్క వెంకటేశ్వర్లు, పూనం సురేష్, పూనమ్ వెంకటేష్, హతీరామ్ నాయక్, తారచంద్, వినోద్ తదితరులు వెళ్లారు.