మునుగోడులో బోడుప్పల్ “గులాబీ” నేతల ప్రచారం

మేడిపల్లి – జనంసాక్షి
మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. మునుగోడులో నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక సందర్బంగా ఓటర్లకు తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి గురించి వివరించారు. బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలనీ విన్నవించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, సీనియర్ నాయకుడు మోదుగు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



