మునుగోడు ఎన్నికల ప్రచారనికి విద్యార్థి నాయకులు.

జనం సాక్షి ఉట్నూర్.
మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి భాగంగా (టీ)బిఆర్ఎస్వి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపుమేరకు మర్రిగూడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెరాస తోనే నియోజకవర్గలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయని మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెరాస పార్టీని బలపరిచిన అభ్యర్థి కుసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి గెలిపించి అభివృద్ధి బటలో మునుగోడు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల తో కలిసి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమేందర్ వెంకన్న సతీష్ తదితరులు ఉన్నారు.



