మునుగోడు గెలుపుతో తాలూకా రాజకీయం మలుపు..?
– నిన్నటి వరకు అందరూ చూపు భాజపా పైనే..!
– ఇప్పుడు సందిగ్ధంలోపడ్డ నేతలు..!
– తాలూకా లో కాషాయం ఎగరడం కష్టమేనా..?
జనంసాక్షి ,బై0సారూరల్(స్టోరీ).
నిన్నటి మునుగోడు గెలుపుతో నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకాలో రాజకీయం మరోసారి మలుపులు తిప్పుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దుబ్బాక,హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా దూసుకుపోగా మునుగోడు బైఎలక్షన్ తో మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటే కమలం కాస్త వికసించకపోవడంతో నాయకులు,ప్రజలలో సందిగ్ధం నెలకొ0ది.నిన్నటి వరకు రానున్న రోజుల్లో తాలూకా లో తెరాస కి భాజాపానే గట్టి పోటీ అనుకున్న నేతలు,ప్రజలు మునుగోడు తెరాస గెలుపుతో ఒక్కసారిగా కంగుతున్నారు.
నిన్నటి వరకు అందరూ చూపు భాజపా వైపే
తెలంగాణ రాష్ట్రంలో భాజపా బలపడుతున్న కొధ్ది, తాలూకాలో కూడా అదే రేంజ్లో పు0జుకుంటుంది. వేరే పలు పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలు సైతం మునుగోడు ఎలక్షన్ తర్వాత భాజపాలో చేరేందుకు రంగ0సిద్ధం చేసుకున్నట్టుగా తెలిసింది. ఒకానొక టైంలో కాంగ్రెస్ క్రమంగా బలహీనమైతున్న తరుణంలో నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు రామారావు పటేల్ సైతం పార్టీమారి భాజపా కండువ కప్పుకుంటారు అని ప్రచారం జరిగింది. కాకపోతే మునుగోడు భాజపా గెలుపు తర్వాత మంచి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సన్నిహితులు, రాజకీయవిశ్లేషకులు, ప్రజల నుంచి సమాచారం. ఓకనోక సమయంలో మాజీ మంత్రి, రాష్ట్ర ఢిల్లీఅధికార ప్రతినిధి వేణుగోపాల చారి సైతం భాజపా లో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది.
ప్రస్తుత అధికారపార్టీ, కాంగ్రెస్ పార్టీలలో చిన్న నాయకులనుంచి ఓ మోస్తారు గుర్తు0పు ఉన్న నాయకులు సైతం బై ఎలక్షన్ తరువాత భాజపాలో చేరుతారన్న ప్రచారం జోరుగా ఉపొందుకు0ది. తీరా చూస్తే మునుగోడు భాజాపాకి అనుకూల ఫలితం ఇవ్వకపోవడంతో భాజపా లో చేరుదామనుకున్న నాయకులు, కార్యకర్తలు సైతం పునరాలోచన పడినట్లు తెలుస్తుంది.
తాలుకాలో కాషాయం పరిస్థితి మూగబోతు0దా..?
మునుగోడులో భాజపా గెలుపొందుతుందని,ఆ తర్వాత తాలూకాలో భాజపా బలంగా పు0జుకొని,పార్టీలో పెద్ద మొత్తంలో నాయకులు కార్యకర్తల రూపంలో చేరికలు జరిగి రానున్న 2023 ఎలక్షన్స్ లో తెరాసకు గట్టి పోటీ ఇచ్చి తాలూకాలో కాషాయజెండా ఎగురుతుందని కలగన్న కాషాయవాదులకు మునుగోడు భాజపా ఓటమి చేదుఅనుభవమే మిగిల్చిందని,ఈ లెక్కన మళ్లీ భాజపా లో చేరికలు కష్టమైన పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.